భారతీయులలో చాలామందికి చాయ్ అంటే జీవితం లాంటిది. ఉదయాన్నే ఒక కప్పు చాయ్ తాగకుండ వారి రోజు గడవదు. అయితే ఖాళీ కడుపుతో తాగే ఆ మొదటి కప్పు చాయ్ మన హార్మోన్లను గందరగోళానికి గురిచేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం నిద్రలేచిన వెంటనే శరీరం సహజంగా కార్టిసాల్ (Cortisol) అనే హార్మోన్ విడుదల చేస్తుంది.
ఇది మనకు చురుకుదనం, అప్రమత్తతను ఇస్తుంది కానీ అదే సమయంలో చాయ్ లేదా టీ రూపంలో కెఫీన్ (Caffeine) తీసుకుంటే, కార్టిసాల్ స్థాయిలు అసహజంగా పెరుగుతాయి. దీని వల్ల కొంతసేపటికి ఆందోళన, అసహనం, అలసట వంటి లక్షణాలు కనపడవచ్చు అని హెచ్చరించారు. ఈ హార్మోన్ల అసమతుల్యత ఇన్సులిన్ సమతుల్యతను కూడా ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ మన రక్తంలో చక్కెర స్థాయిని, ఆకలిని నియంత్రించే హార్మోన్.
ఖాళీ కడుపుతో చాయ్ వల్ల చాలామందికి acidity మరియు హార్ట్‌బర్న్ (జలదర) సమస్యలు రావచ్చు. టీలోని టానిన్లు మరియు కెఫీన్ ఐరన్, కాల్షియం వంటి ముఖ్య పోషకాలు శరీరంలో శోషించబడకుండా అడ్డుకుంటాయి. దీర్ఘకాలంలో ఇది శక్తి స్థాయిలు, మానసిక స్థితి, మరియు మహిళల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
అయితే మీరు చాయ్ తాగడాన్ని మానాల్సిన అవసరం లేదు, కానీ నిద్రలేచిన తరువాత కనీసం ఒక గంట తర్వాత తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలా చేస్తే ..మెటాబాలిజం మెరుగుపడుతుంది. హార్మోన్ల సమతుల్యత, అలాగే ఉదయపు ఆ చాయ్ రుచిని ఆరోగ్యకరమైన రీతిలో ఆస్వాదించవచ్చు.తగిన విరామంతో చాయ్ తాగడం ద్వారా మీ శక్తి, మానసిక సమతుల్యత, మరియు హార్మోన్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
