Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు తెలిసిందే ఇదే!

- Advertisement -

అందితే జుట్టు అందకపోతే కాళ్లు ఇది పాత సామెత..కానీ ఇప్పుడు ముందు తిట్టు.. ఆ తర్వాత కాకపట్టు. ఇది టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసిన సామెత. ఏపీలో ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాశంగా మారింది.

అధికారంలో ఉన్నప్పుడు అది తలకెక్కించుకుని ఎవరిని పడితే వారిని తిట్టడం, అధికారం, అవసరం తీరిపోయాక అవసరమైతే కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధ పడటం చంద్రబాబుకు తెలిసింది ఇదే. అధికారంలో ఉన్నప్పుడు పవన్‌ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసింది ఇదే బాబు. కానీ అధికారం పోయి తిరిగి అవసరం వచ్చే సరికి పవన్ దేవుడు అయిపోయాడు. బీజేపీ పరిస్థితి అంతే. అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ,మోడీని తిట్టిన బాబు ఇప్పుడు అదే పార్టీ కోసం స్నేహాస్తం చాటుతున్నారు.

ఇక వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్‌ను వదల్లేదు బాబు, ఎల్లో మీడియా. ఆయన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు అదే పీకే అవసరం అయ్యే సరికి స్వరం మార్చేశారు. పీకేపై పొగడ్తలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు. నాడు ప్రశాంత్ కిశోర్ ని బిహార్ డెకాయిట్‌గా అభివర్ణించారు చంద్రబాబు. ప్రశాంత్ తోక కత్తిరిస్తానని, బిహార్ రాజకీయాలు ఏపీలో చెల్లవని కామెంట్స్ చేసిన నోటీతోనే ఇప్పుడు పీకేపై ప్రశంసలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక బాబు గురించి తెలిసిన వారు మాత్రం ఇది ఆయనకు అలవాటేనని రేపు మళ్లీ విమర్శలు గుప్పించడానికి రెడీగా ఉంటారని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -