Friday, May 9, 2025
- Advertisement -

జగన్‌,పవన్‌ కాదు..ఢిల్లీకి లోకేష్

- Advertisement -

టీడీపీ అధినేత,మాజీ సీఎం చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇక గురువారం చంద్రబాబుతో పవన్,లోకేష్,బాలకృష్ణ ములాఖత్ జరిగింది. అనంతరం వెంటనే టీడీపీతో పొత్తును అనౌన్స్ చేశారు పవన్. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు ఈ ములాఖత్‌లో ఏం చర్చించారనే దానిపై అంతా చర్చిస్తున్నారు. ప్రధానంగా ఈ కేసు నుండి బయట పడేందుకు , బెయిల్ రావడానికైనా బీజేపీ పెద్దల దీవెన ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో బీజేపీతో సఖ్యతగా ఉన్న పవన్‌తో చంద్రబాబు ఇదే అంశంపై చర్చించారని టాక్ నడుస్తోంది.

అందుకే ములాఖత్ తర్వాత పవన్,బాలయ్య,లోకేష్ కీలక భేటీ జరిగింది. అనంతరం లోకేష్ హస్తినకు పయనమయ్యారు. అయితే వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత విదేశాల నుండి వచ్చిన జగన్‌ ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది. తర్వాత పవన్ కూడా హస్తినకు పయనమవుతారని వార్తలు రాగా వీరిద్దరిని కాదని లోకేష్‌ ఢిల్లీ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పవన్‌ సూచనతో లోకేష్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇక రెండు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు లోకేష్. చంద్రబాబు అరెస్ట్ పరిణామాలన్నింటిపై జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలను కలిసి వివరించే అవకాశం ఉందట. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోరగా దీనిపై ఆయన కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులు, కొందరు జాతీయ స్థాయి నాయకులనూ నారా లోకేష్ కలుసుకుంటారని టాక్ నడుస్తోంది. మొత్తంగా చంద్రబాబును ఈ కేసు నుండి కడిగిన ముత్యంలా బయటకు తెచ్చేందుకు టీడీపీ నేతలతో పవన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి వారి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -