- Advertisement -

చంద్రబాబు స్టైలే అంతా..నాన్చుడు ధోరణే!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుది రాజకీయాల్లో ప్రత్యేక శైలీ. అదేంటంటే ఏ విషయాన్ని అంత ఈజీగా తేల్చడు.నాన్చుడు..నాన్చుడు..ఇదే చంద్రబాబు పాలిటిక్స్. తాజాగా సార్వత్రిక ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న ఇప్పటివరకు ఏం తేల్చలేకపోతున్నారు బాబు. అదిగో, ఇదిగో లిస్ట్ అంటూ ప్రచారం జరుగుతున్న చంద్రబాబులో మాత్రం ఎలాంటి చలనం లేదు.

కొన్ని చోట్ల జనసేన నేతలతో సమస్య అయితే మరికొన్ని చోట్ల టీడీపీ సీటు ఆశీస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉండటం అడ్డంకిగా మారింది. ఆశావహులు ఎక్కువగా ఉండటంతో గ్రూపురాజకీయాలకు తెరతీయడంతో పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఎవరు అభ్యర్థి అవుతారో తెలియక.. ఎవరి వెంట తిరగాలో తేల్చుకోలేక కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు.

ఇంత జరుగుతున్న అభ్యర్థుల ప్రకటనపై చంద్రబాబు మౌనంగానే ఉంటున్నారు. వైసీపీ బలంగా ఉన్న చోట అభ్యర్ధుల ప్రకటన మరింత ఆలస్యమైతే ఎన్నికల రణరంగంలో విజేతలుగా నిలవడం సాధ్యమా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అంతర్గత కుమ్ములాటలకు టీడీపీ పుల్ స్టాప్ పెట్టకపోతే పుల్‌స్టాప్‌ పెట్టి, అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకుంటే మరింత నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -