ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకోనుంది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు వాదనలు విననుంది. అయితే చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ను ముందుగా విచారించాలని సీఐడీ, బెయిల్ పిటిషన్‌ను ముందుగా విచారించాలని చంద్రబాబు తరపు లాయర్లు న్యాయమూర్తికి విన్నవించారు. న్యాయ పరైమన అంశాలను పరిశీలించిరెండింటిలో ఏదో ఒక పిటిషన్ ను విచారణ చేస్తానని, ఆ తర్వాత రెండో పిటిషన్ పై విచారణ జరుపుతానని…తీర్పు మాత్రం ఒకేసారి వెల్లడిస్తానని చెప్పారు.
దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు ముందుగా ఏ పిటిషన్ పై విచారణ జరుపుతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో లిస్టింగ్ కు వస్తుందా? రాదా? అన్నది తెలియాల్సి ఉంది.
ఇక సుప్రీంలో మెన్షన్ లిస్ట్ ద్వారా విచారణకు సూచించగా ఏ రోజు విచారణ చేస్తామనే దానిని వెల్లడించనుంది. అయితే క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసిన న్యాయవాది సిద్ధార్థ లూద్రా దీనిని అత్యవసరంగా విచారించాలని…ఇది ఏపీకి చెందిన వ్యవహారమని, అక్కడ ప్రతిపక్షాలను అణిచి వేస్తున్నారని లూద్రా ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో ఇటు ఏసీబీ కోర్టు…అటు సుప్రీం కోర్టులో బాబు బెయిల్, కస్టడీ పీటిషన్‌పై ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.