Monday, May 20, 2024
- Advertisement -

టెన్షన్..ముగిసిన వాదనలు..తీర్పు రిజర్వ్

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు చంద్రబాబు. ఇక ఆయన రెగ్యులర్ బెయిల్‌పై వాదనలు ముగిశాయి. చంద్రబాబు హెల్త్ రిపోర్టుకు సంబంధించి ఆయన తరపు న్యాయవాదులు రిపోర్టు సమర్పించగా ఇవాళ సీఐడీ తరపున వాదనలు వినిపించారు అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వొద్దని..ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఇచ్చిన నివేదికలపై అనుమానం ఉందని తెలిపారు.

ఇక ప్రధానంగా మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ కండీషన్స్ ఉల్లంఘించి చంద్రబాబు ర్యాలీలు చేశారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ర్యాలీలు చేయడంపై తెలంగాణలో కూడా కేసులు నమోదయ్యాయని తెలిపిన ఆయన..చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని తెలిపారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వవద్దని..సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపారు. చట్టం ముందు అంతా సమానమేనని ఈ కేసు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని తన వాదనలు వినిపించారు.

చంద్రబాబుకు అక్రమంగా కేసులో ఇరికించారని…పోలీస్ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కానీ అధికారంలో ఉన్న వారికి తొత్తులుగా ఉన్నారని వాదించారు సిద్ధార్థ్ లూథ్రా. ఇరువర్గాల వానదలు విన్ని న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. మరో వైపు స్కిల్‌ స్కామ్‌లో ఏ13గా ఉన్న సీమెన్స్‌ కంపెనీ ప్రతినిధి సుదీష్‌ చంద్రకాంత్‌ షా అప్రూవర్‌గా మారారు. ఆయనను వచ్చే నెల 5న కోర్టులో హాజరుపరచాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీంతో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -