Monday, May 20, 2024
- Advertisement -

బాబు ఆశలన్ని క్వాష్ పిటిషన్‌ పైనే!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు.ఈ నెల 28 సాయంత్రం 5 గంటల లోపు చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక జైలు నుండి బయటకు వచ్చినా టీడీపీ కార్యకర్తలను కలవలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు. ఇక వినాయక చవితి, దసరా రెండు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే జరుపుకోగా దీపావళి మాత్రం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వెసులుబాటు లభించింది.

ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన రెగ్యులర్ పిటిషన్ నవంబర్‌ 15కి వాయిదా పడగా ఫైబర్ నెట్ కేసులో బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ నవంబర్ 30కి వాయిదా పడింది. ఇక అప్పటివరకు ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం సూచించింది.

చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్లకుండా ఉండాలంటే సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తీర్పు రావాల్సిందే. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే బిగ్ రిలీఫ్ లభించినట్లే. కానీ ఒక వేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం కేసుల మీద కేసులతో చంద్రబాబు నెలల తరబడి జైలులోనే ఉండాల్సి వస్తుంది. క్వాష్ పిటిషన్ పైన ఈ నెల 23లోగా తీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో బాబు ఆశలన్నీ క్వాష్ పిటిషన్ పైనే ఉన్నాయి. టీడీపీ నేతలు సైతం ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠతతోనే ఎదురు చూస్తున్నారు. అయితే ఒకవేళ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రిలీఫ్‌ దొరికినా మిగితా కేసుల రూపంలో బాబుకు చిక్కులు తప్పవు. కానీ కొంత సమయం దక్కే అవకాశం ఉండటంతో వాటిలో కూడా ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేయక తప్పని సిచ్యువేషన్. మొత్తంగా మధ్యంతర బెయిల్‌లో బాబుకు దక్కిన రిలీఫ్ ఏంటంటే కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకోవడం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -