Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చే టైం వచ్చేసింది!

- Advertisement -

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. కుప్పంలో నారా భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…చంద్రబాబు భార్యే ఆయనకు రెస్‌ట ఇవ్వాలని కోరుతుందని…ఎన్టీఆర్ బిడ్డ అడిగిన కోరికను మనమంతా గౌరవించాలని సెటైర్ వేశారు.

భువనేశ్వరి తన మనసులోని మాటనే బయట పెట్టిందని..ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలు నెరవేర్చి ఆయనకు రెస్టు ఇద్దామంటూ చెప్పుకొచ్చారు. చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి భువనేశ్వరికి అప్పచెబుదాం… ఎవరు ఎంత మందితో కలిసి వచ్చినా 2024లో చంద్రబాబుకు పూర్తిస్థాయి రెస్టు తప్పదు అన్నారు నాని.

వాస్తవానికి చంద్రబాబు, లోకేష్ అంటే ఒంటి కాలిపై లేస్తారు కొడాలి నాని. ఘాటైన కామెంట్స్‌తో బాబు,లోకేష్‌లను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అలాంటిది చంద్రబాబు భార్యే ఆయనకు రెస్ట్ ఇవ్వాలని సరదాగా వ్యాఖ్యానించినా, ఆ కోరికను నెరవేర్చాలని నాని చేసిన కామెంట్స్ చర్చనీయాశంగా మారాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -