Thursday, May 16, 2024
- Advertisement -

31 లక్షల మంది జీవితాల్లో వెలుగులు!

- Advertisement -

సొంతిల్లు ప్రతి పదేవాడి కల. దేశానికి స్వాతంత్య్యం వచ్చి 75 ఏళ్లు దాటిపోయినా ఇంకా పేదవారు పేదవారిగానే ఉండిపోయారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన పేదల జీవితాల్లో మాత్రం వెలుగులు నిండటం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్ పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. ఇక ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు జగన్.

ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 20,840 మంది పేద మహిళలకు సర్వ హక్కులతో రిజిస్టర్ చేసిన ఇంటి స్థలం, భూమి బదిలీ పత్రం, కట్టుకోడానికి ఇళ్లు మంజూరు చేసి ధృవీకరణ పత్రాలు అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు.

లబ్దిదారులు పదేళ్ల తర్వాత ఆటోమేటిక్ గా క్రయ, విక్రయ, దాన, వారసత్వ హక్కులతో సహా పూర్తి హక్కులు లబ్దిదారులకు లభిస్తాయి. అత్యవసర సమయాల్లో ఇంటిని అమ్ముకునే వీలు కలుగుతుంది. పేదలకు పక్కా గృహాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడా లేని విధంగా 71,811 ఎకరాల్లో 31.19 లక్షల మందికి ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు.ఒక్కోప్లాట్ విలువ ప్రాంతాన్ని బట్టి రూ.2.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -