Saturday, May 10, 2025
- Advertisement -

సీనియర్లకు చెక్ పెట్టి..తాను మాత్రం!

- Advertisement -

వారంతా చంద్రబాబు 40 ఇయర్స్ పొలిటికల్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించిన వారు. అంతేందుకు ఎన్టీఆర్‌ను గద్దె దించి చంద్రబాబును సీఎం కుర్చిలో కూర్చోబెట్టడంలో కీలకపాత్ర. అయితే ప్రస్తుతం మాత్రం పరిస్థితులు మారిపోయాయి. తన పొలిటికల్ కెరీర్ కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు తాజాగా సీనియర్లను వదల్లేదు. తాను సీఎం కుర్చిలో కూర్చోవడానికి కారణమైన వారిని పక్కనబెట్టడంలో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు.

తాజాగా ఏపీలో జరగనున్న ఎన్నికల్లో సీనియర్లైన అశోకగజపతిరాజు,యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకటరావు, బండారు సత్యానారాయణమూర్తి, చింతకాయల అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, హనుమంతరాయ చౌదరి, కేఈ ప్రభాకర్‌, లింగారెడ్డి, వరదరాజులురెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటివారికి చంద్రబాబు సీటు ఇచ్చే పరిస్థితి కనిపిండం లేదు.

ఇందులో కొందరికి జనసేన రూపంలో సీటుకు ఎసరు రాగా మరికొందరిని చంద్రబాబు స్వయంగా తప్పించారు. దీంతో కొంతమంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా టీడీపీలో అన్ని తామై వ్యవహరించిన లీడర్లు 90 శాతం మందికి సీట్లు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కుమారుడు లోకేశ్‌ కోసం సీనియర్లను తప్పించి జూనియర్లతో లైన్‌క్లియర్‌ చేస్తున్నారనే పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు మాత్రం టీడీపీని గట్టెక్కించడం కష్టమేనని వాదన వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -