కేసుల మీద కేసులు జరుగుతున్న పరిణామాలత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు చంద్రబాబు. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు. ఈ కేసుతో పాటు ఫైబర్ నెట్,ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం,నీరు – చెట్టు స్కాంలలో చంద్రబాబు ఉండగా తాజాగా ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చింది.
అక్టోబర్ 4వ తేదీన ఓటుకు నోటు పిటిషన్‌పై విచారణ జరుగనుంది. దీంతో ఓ వైపు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా ఓటు నోటు కేసులో బాబుకు చిక్కు ఎదురవడం ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు వచ్చిన నెక్ట్స్ రోజే ఓటుకు నోటు కేసు లిస్ట్ అవడం టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది.
తనపై నమోదైన ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్ లో ఏం జరగనుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఏదిఏమైనా చంద్రబాబు రిమాండ్ తర్వాత లోకేష్ సైతం రిమాండ్ వెళ్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీడీపీకి ఇది కష్టకాలమే. బాబు రాజకీయ జీవితంలో ఇది ఊహించని పరిణామం. కేసుల మీద కేసులతో బాబు మరిన్ని రోజులు జైలులో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
