Saturday, May 4, 2024
- Advertisement -

అబ్బాయిలు కావాలండోయ్.. ! ఎందుకో తెలుసా?

- Advertisement -

ఇదేంటి అబ్బాయిల‌ను కావాలంటున్నారు.. ఎందుకంటారా..? ఎందుకు అనేది ఈ వార్త చ‌దువుతుంటే తెలుస్తుంది. కానీ కావ‌ల‌సింది మ‌న ద‌గ్గ‌ర కాదు. చైనా దేశంలో.. అదేమిటంటే ప్ర‌పంచంలో అత్య‌ధిక జ‌నాభా ఉన్న దేశంలో అబ్బాయిలు క‌రువేంటి అనుకోవ‌చ్చు. నిజమే.. అక్కడ మ‌గాళ్ల సంఖ్యకు ఏ స‌మ‌స్య లేదు. సమస్య ఏంటంటే.. అచ్చమైన మ‌గాళ్లు లేక‌పోవ‌డ‌మే..

అదేంట‌బ్బా అనుకునేరు. వారి దృష్టిలో బలంగా, ధృడంగా, ఫిట్ గా ఉండే వాళ్లు అని అర్థం. అలాంటి మగాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉందంట. అలాగే అబ్బాయిల్లో స్త్రీ లక్షణాలు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌ట‌. అమ్మాయిల లాగే అబ్బాయిలు కనిపిస్తున్నార‌ట‌. మ‌గ‌వాళ్లు కూడా చాలా నాజుగ్గా, సుకుమారంగా త‌యార‌వుతున్నారంట‌. ఇది ఆ దేశ‌ ప్రభుత్వాన్ని కలవర పెడుతోందంట‌.

దీంతో ఆ దేశ ప్ర‌భుత్వం అప్రమత్తమైంద‌ట‌. ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించేందుకు ప్ర‌య‌త్నం కూడా చేస్తోంద‌ట‌. అందులో భాగంగా అబ్బాయిలను మగాళ్లలా మార్చే ప‌నిలో ప‌డ్డార‌ట‌. దీన‌కి సంబంధించి ఒక ఎడ్యూకేషన్ డ్రైవ్ ను కూడా చెప్ప‌ట్టింద‌ట‌. ఇదంతా.. మెరుగైన స్పోర్ట్స్ స్టార్స్ ను తీర్చిదిద్దేందుకే అని ప్ర‌భుత్వం భావిస్తోంది. అందులో భాగంగా విద్యా శాఖ ఓ నోటీస్ జారీ చేసింద‌ట‌. బాలురను ధృడంగా మార్చాల‌ని నోటీస్ లో పేర్కొంద‌ట. చూడాలి మరి ఇలాగైనా చైనాకు అబ్బాయి కొరత తీరుతుందో లేదో.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -