Saturday, April 20, 2024
- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పదవికి రాజీనామా!

- Advertisement -

నిన్నటి వరకు ఏపిలో ఎన్నికల సెగ అయితే ఇప్పుడు విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదం పై పోరాటాలు మొదలయ్యాయి. అయితే ఈ సమస్య ఇప్పటిది కాదు.. ప్రతి ఏడాది బడ్జెట్ తర్వాత తెరపైకి వచ్చే అంశం. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్ కు పంపించారు.

స్టీల్ ప్లాంట్ పై కేంద్రం నిర్ణయం అమల్లోకి వచ్చిన వెంటనే రాజీనామా ఆమోదించాలని కోరిన గంటాశ్రీనివాసరావు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే.

గంటా శ్రీనివాసరావు రాజీనామ లేఖ

ఇదిలా ఉంటే.. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత గంటా పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పలుమార్లు ఆయన వైసీపీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారైందంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆయన ఏ పార్టీలోనూ చేయలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ట్విట్టర్‌లో స్పందించిన కాసేపటికే గంటా రాజీనామా చేయడం చర్చనీయాంశమవుతోంది.

అబ్బాయిలు కావాలండోయ్.. ! ఎందుకో తెలుసా?

పెద్ద సమస్యలో పడ్డ మారుతి… అనుకున్న సమయానికి విడుదల చేస్తాడా..??

ఈ స‌ర్పంచ్ ను ఆద‌ర్శంగా తీసుకోవాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -