- Advertisement -

రాహుల్ తీరుపై సీఐఎస్ఎఫ్‌ అసహనం!

- Advertisement -

ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది సీఐఎస్‌ఎఫ్‌. ఈ మేరకు రాహుల్‌తో పాటు మల్లికార్జున ఖర్గేలకు లేఖ రాసింది సీఐఎస్‌ఎఫ్‌.

ఇద్దరూ సెక్యూరిటీ ప్రొటోకాల్ పాటించడం లేదని…Z+ ASL కేటగిరీ భద్రతలో ఉన్న రాహుల్ గాంధీ యెల్లో బుక్ ప్రొటోకాల్ పాటించకుండా విదేశీ పర్యటనలు చేస్తున్నట్లు అందులో పేర్కొంది. నిబంధనల ప్రకారం 15 రోజుల ముందే సెక్యూరిటీ ఏజెన్సీకి సమాచారం ఇవ్వాలి ఉంటుంది.

అయితే గత 9 నెలల్లో 6 పర్యాయాలు సెక్యూరిటీ నిబంధనలను రాహుల్‌ ఉల్లంఘించినట్లు సీఐఎస్‌ఎఫ్‌ తన లేఖలో పేర్కొంది. కనీసం భవిష్యత్తులోనైనా ప్రోటోకాల్‌లు పాటించాలని CISF అప్పీల్ చేసింది.

డిసెంబర్ 30, 2024 – జనవరి 9, 2025న రాహుల్‌ (ఇటలీ)లో పర్యటించారని,మార్చి 12-17 (వియత్నాం),ఏప్రిల్ 17-23 (దుబాయ్),జూన్ 11-18 (కతార్), జూన్ 25 – జూలై 6 (లండన్),సెప్టెంబర్ 4-8 (మలేషియా)లో రాహుల్ పర్యటించినట్లు తెలిపింది సీఐఎస్‌ఎఫ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -