- Advertisement -

సూపర్ సిక్స్..అట్టర్ ఫ్లాప్!

- Advertisement -

సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అన్నారు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్. మా హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి మార్కెట్ లో పోటీ ఉత్పన్నం అయ్యేలా చేశాం అన్నారు. ప్రతి ఆర్బీకే పరిధిలో సీఎం యాప్, ఈ క్రాప్ ఉండేవి. వ్యవసాయ పంటల ధరలు, పంటల సేకరణ గురించి స్వయంగా ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షించే వ్యవస్థ ఉండేది అన్నారు. వాటన్నిటినీ నిర్వీర్యం చేశారు. పీఎం కిసాన్ కాకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో 20 వేలు ఇస్తామని మాటలు చెప్పి తొలి ఏడాది ఎగ్గొట్టి, ఈ ఏడాది 5వేలు మాత్రమే ఇచ్చి రైతులను మోసం చేశారు అన్నారు.

గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువగా యూరియా సప్లై చేశామని చంద్రబాబు చెబుతున్నాడు… నిజంగా యూరియా తగినంత సప్లై జరిగి ఉంటే రైతులు ఇలా రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది? అన్నారు. ఆర్బీకేలను, ఈ క్రాప్ ను, PACలను నిర్వీర్యం చేసి, ప్రైవేటుకు ఎక్కువ కేటాయించడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. టీడీపీ నేతలే యూరియా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు అన్నారు.

రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్‌ మార్కెట్‌ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తున్నాయి… దీన్ని నిరసిస్తూ రైతులతో కలిసి ఆర్డీవోలకు అర్జీలు ఇచ్చే కార్యక్రమం మా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేసింది అన్నారు. దీన్ని అడ్డుకుంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అర్ధరాత్రి పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి బెదిరించారు. రైతుల తరపున, రైతులకు తోడుగా వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నిలిస్తే తప్పేంటి? అని అడుగుతున్నా. మీరు రైతుకి అందాల్సిన ఎరువులు సక్రమంగా అందించి ఉంటే, మీరు ఎరువుల విషయంలో స్కాములు చెయ్యకుండా ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా చెప్పాలన్నారు.

దీపం పథకం కింద ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు.. ఎప్పటిలానే ఇచ్చిన మాట గాలికి వదిలేశారు. మొదటి ఏడాది అరకొర ఒక సిలిండర్ ఇచ్చి మమ అనిపించారు. ఇక ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -