ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ..ఆంధ్ర నేతలకు అనిరుధ్ రెడ్డి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్…. ఈరోజు ఒకరి దగ్గర ప్యాకేజ్ తీసుకుని మాట్లాడుతున్నారు…రేపు గనుక జగన్ ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చురకలు అంటించారు. అలాంటి వ్యక్తికి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ని విమర్శించే అర్హత గానీ…స్థాయి గానీ ఎంతమాత్రం లేదు అని మండిపడ్డారు.
దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి అని ఏపీ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేను ఆయన ఇంటి ముందే నిలబడతా… తెలంగాణ బిడ్డలను ఎవరినైనా ముట్టుకోవాలని ఆంధ్ర నుండి ఎవరైనా వస్తే ఇక్కడ ‘గో బ్యాక్ ఆంధ్ర’ ఉద్యమం మొదలవుతుంది అని హెచ్చరించారు.
మీరంతా ఉండేది హైదరాబాద్‌లోనే కదా, అన్ని డబ్బులు పెట్టి అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు?… అమరావతికి బదులు జడ్చర్లలో రాజధాని కట్టుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు.
