- Advertisement -

మెగా డీఎస్సీ కాదు.. ‘దగా డీఎస్సీ’!

- Advertisement -

ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఇది మెగా డీఎస్సీ కాదని, రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద నియామక అవినీతి అని, ఇదొక ‘దగా డీఎస్సీ’ అని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లా పామర్రులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాని.. మెరిట్ లిస్టులు ఎందుకు దాస్తున్నారు? అని ప్రశ్నించారు.

డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పేర్ని నాని పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఈ డీఎస్సీ పరీక్షలు రాశారు. మిగిలిన అన్ని రకాల ఉద్యోగ నియామకాలకు మెరిట్ లిస్టులు ప్రకటిస్తున్న ప్రభుత్వం.. కేవలం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన మెరిట్ లిస్టులను ఎందుకు దాచిపెడుతోంది? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు.

ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద ఎంపికైన 421 మంది అభ్యర్థుల వివరాలను, వారి సర్టిఫికెట్లను తక్షణమే బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఇలాంటి అక్రమాలకు తెరలేపిందని, ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సిబిఐ (CBI) దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లక్ష్యంగా పేర్ని నాని విమర్శలు గుప్పించారు. నారా లోకేష్ తన సొంత శాఖను గాలికి వదిలేసి.. చిత్ర విచిత్రాలు ప్రదర్శిస్తూ మిగిలిన అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారు. గురువుల నియామకంలో విద్యాశాఖ చేసిన తప్పుడు పనులన్నింటికీ ఆయనే సమాధానం చెప్పాలి అని మండిపడ్డారు.

అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన తప్పుబట్టారు. గతంలో నిరుద్యోగుల పక్షాన నిలబడి అన్యాయాన్ని ప్రశ్నిస్తా అన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు నిరుద్యోగ యువతకు జరుగుతున్న ఇంత పెద్ద అన్యాయంపై రోజుకో మాట మారుస్తూ నోరు మెదపకుండా కూర్చున్నారని పేర్ని నాని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -