ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఐదున్నర నెలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ కండీషన్స్‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధం కాదు అని తెలిపింది. ఈ సందర్భంగా పలు షరతులు విధించింది న్యాయస్థానం. 10 లక్షల పూచీకత్తు, ఇద్దరు సెక్యూరిటీ సంతకం ఇవ్వాలని కేజ్రీవాల్‌కు తెలిపింది. ట్రయల్ కోర్టుకు విచారణ హాజరుకావాలి..సాక్ష్యాలను టాంపర్ చేయకూడదు అని తెలిపింది.
జూలై నెలలో ఈడీ కేసులో కేజ్రీవాల్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే ఆప్ నేత మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రాగా తాజాగా కేజ్రీవాల్‌కు సైతం బెయిల్ రావడంతో ఆయన తీహార్ జైలు నుండి బయటకు రానున్నారు.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు వినిపించారు. ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కేజ్రీవాల్ పేరు లేదు. కేజ్రీవాల్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని రెండుసార్లు సుప్రీంకోర్టు, ఒకసారి ట్రయల్ కోర్టు ఆదేశించాయని తెలిపారు.