Saturday, April 27, 2024
- Advertisement -

లిక్కర్ స్కాం…సీఎం కేజ్రీవాల్ అరెస్ట్

- Advertisement -

అంతా అనుకుందే జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. సాయంత్రం కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న 12 మంది అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొనగా కేజ్రీ ఇంటికి వచ్చే అన్ని దారులను మూసివేశారు.

తనిఖీల అనంతరం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తున్నట్లు తెలిపారు ఈడీ అధికారులు. కేజ్రీవాల్ వాడుతున్న సెల్ ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని తొమ్మిది సార్లు సమన్లు జారీ చేశారు.

అయితే కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు. ఇక గురువారం ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నిరాశే ఎదురుకావడంతో కేజ్రీ ఇంట్లో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -