నిజామాబాద్‌లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ సందర్భంగా నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆంధ్ర వాళ్ళు సినిమాలకు వైబ్ అవుతారు. మన తెలంగాణలో కళ్ళు, మటన్ కి వైబ్ అవుతారు అని దిల్ రాజు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో వివాదంపై క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఉన్నారు ఆయన..తనను రాజకీయాల్లోకి లాగొద్దని తెలిపారు. నేను తెలంగాణ వాడినేనన్నారు.
FDC రాజకీయాలకు వేదిక కాదు. FDC సినిమాలకు మాత్రమే ఉపయోగపడేలా చేస్తాం అన్నారు. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడేలా FDCని తీర్చిదిద్దుతాను అని అన్నారు. సంక్రాంతికి రెండు సినిమాలు విడుదలవుతుండటం వల్ల నేను తెలంగాణ దావత్ ను మిస్ అవుతున్నానని, సినిమా రిలీజ్ అయ్యాక తెలంగాణ దావత్ చేసుకుంటానని చెప్పాను అది అర్థం చేసుకోకుండా కొంతమంది విమర్శలు చేస్తున్నారన్నారు. నా మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి అన్నారు.