Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీ జాబితాలో దిల్ రాజు!

- Advertisement -

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈసారి బీజేపీ గెలిచి మోడీని హ్యాట్రిక్ సీఎం చేయాలని బీజేపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ఇక తెలంగాణలో 10 సీట్లు టార్గెట్‌గా పావులు కదుపుతోంది. త్వరలోనే ఫస్ట్ లిస్ట్ విడుదల కానుండగా ఇప్పటికే ఆరు స్థానాల్లో అభ్యర్థులపై క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.

సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్, ఖమ్మం నుంచి డాక్టర్ వెంటకేశ్వర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.

ఇక ఎవరూ ఊహించని విధంగా బీజేపీ జాబితాలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు వినిపిస్తోంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో దిల్ రాజు పోటీ చేయడం ఖాయమని ఇందుకు సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దిల్ రాజు ఎక్కడి నుండి పోటీ చేస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -