జనసేన ఆవిర్భావం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఏపీలోనే కాదు తమిళనాట ఆగ్రహం వ్యక్తమవుతోంది. పవన్ కామెంట్స్‌పై సినీ ప్రముఖులే కాదు ఏపీలోని పొలిటికల్ పార్టీలు సైతం తప్పుబట్టాయి.
ఇక సోషల్ మీడియాలోనైతే పవన్‌ను ఏకీ పారేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్.. మతం, దేవుడు, చంద్రబాబు, భాషపై చేసిన కామెంట్స్‌ని వైరల్ చేస్తూ మండిపడుతున్నారు. సెక్యులర్ అంటూ రాజీయాల్లోకి అడుగుపెట్టిన పవన్.. ఇవాళ బీజేపీతో ఏకమై హిందూ పార్టీగా మార్చుకుని భాషల పేరుతో రాష్ట్రాలపై విమర్శలు చేయడం సరైనది కాదు అంటూ తమిళనాడు నేతలు చురకలు అంటిస్తున్నారు. ముఖ్యంగా డీఎంకే నేతలు పవన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన ఆవిర్భావ సభ కాకినాడ జిల్లాలో ఆయనకు పెద్ద ఎత్తున మెజారిటీ అందించిన పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. తమిళనాడు ఎందుకు హిందీని బహిష్కరిస్తుంది? అలాంటి తరుణంలో తమిళ్ సినిమాలు హిందీలో డబ్ చేయడం కూడా మానేయండి… మీకు ఉత్తరాది కావాలి, బీహార్ నుంచి పనిచేసేవారు కావాలి కానీ ఉత్తరాది భాషను మాత్రం వేరుచేస్తారు అని పరోక్షంగా తమిళనాడు సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు పవన్.
