- Advertisement -

అనకాపల్లిపై అణు బాంబ్!

- Advertisement -

అప్పుడు కొవ్వాడ… ఇప్పుడు అనకాపల్లి వెరసీ ఉత్తరాంధ్ర ప్రజలు మరో పోరాటినికి సిద్ధమవుతున్నారు. అనకాపల్లిలో 2,800 మెగావాట్ల సామర్థ్యంతో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యతను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అప్పగించడమే కాదు స్థానికంగా భూసేకరణ కోసం 2,000 ఎకరాల భూమిని కేటాయించాలని చంద్రబాబు సర్కార్‌ని కోరింది.

దీంతో ఇది స్థానిక ప్రజలను కలవరపెడుతోంది. దీనిని స్థానిక ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సస్యశ్యామలమైన వ్యవసాయ భూమిని, రాష్ట్రప్రభుత్వం సహాయంతో సేకరించి, రెండువేల కుటుంబాల జీవితాల్లో భయానక వాతావరణం సృష్టించింది. ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తే ప్రభుత్వానికి తగిన శాస్తి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు ఎంత ప్రమాదకరమో జపాన్ లో ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టు లో, 2011 లో జరిగిన అతి ఘోరమైన ప్రమాదం తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్పష్టంగా అవగాహన వచ్చింది. 2011లో జరిగిన ఈ ప్రమాదంలో రియాక్టర్లను పూర్తిగా శుద్ధి చేయాలంటే 2050 సంవత్సరం వరకు సాధ్యం కాదు.

ఒకవేళ అనకాపల్లిలో అణు ప్రాజెక్టును ప్రారంభిస్తే స్థానికులకు ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ఆ ప్రాజెక్టులను తయారుచేసే సంస్థలు విదేశాల్లో ఉండటం వలన, ఆయా దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -