- Advertisement -

మహానాడు కుర్చీ కోసం వేలం..ఇంత దారుణమా!

- Advertisement -

తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిర్వహించిన మహానాడులో ఎన్నో వింతలు జరిగాయి. కూటమి సర్కార్ చేసిన అభివృద్ధి పనులు..పార్టీ పనితీరుపై చర్చించిన దానికంటే జగన్ నామ స్మరణతో సరిపోయింది. ఇక తాజాగా ‘మహానాడు’ వేదికపై ఈసారి ఒక విచిత్రమైన.. అంతకంటే దారుణం వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా రాజకీయాల్లో పదవులు, టికెట్లు అమ్ముకుంటారని మనం వింటూంటాం కానీ ఏకంగా కుర్చి కోం వేలం జరిగడం చూశారా..అదే వింత కాదుకాదు రాజకీయాల్లో ఇంతకంటే దిగజారుడు తనం ఉండదేమో. పార్టీ అధినేతల పక్కన కూర్చునే కుర్చీ ని కూడా వేలం వేసి అమ్ముకున్నారనే వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ పత్రిక ‘జమీన్ రైతు’ సోషల్ మీడియా వేదికగా ఈ సంచలన నిజాన్ని బట్టబయలు చేసింది.

రాజకీయాల్లో ఉండే నేతలకు ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుంది. పార్టీలోని అగ్ర నేతలతో కలిసి తాము సన్నిహితంగా ఉన్నట్లు జనాల్లోకి ప్రొజెక్ట్ చేసుకోవాలని ఆరాటపడుతుంటారు. అందుకే అగ్ర నేతలు మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా వారి పక్కన నిలబడటానికి ఒక పెద్ద గుంపే పోటీ పడుతుంటుంది. దీనినే ఇప్పుడు మహానాడు వేదికగా క్యాష్ చేసుకున్నారు కొంతమంది. మహానాడు వేదిక మీద పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ల పక్కన లేదా వారి వెనుక సీట్లలో ఉండే కుర్చీలకు ఏకంగా ‘వేలం పాట’ జరిగినట్లు జమీన్ రైతు పత్రిక వెల్లడించింది.

ఈ క్రమంలో జరిగిన వేలం పాటలో ఒక మహిళా నాయకురాలు పోటీ పడి మరి ఏకంగా పది లక్షల రూపాయల భారీ ధరకు చంద్రబాబు వెనుక ఉండే ఒక కుర్చీ సీటును కొనుగోలు చేశారట. కేవలం కొద్ది గంటల పాటు టీవీ స్క్రీన్‌పై కనిపించడం కోసం రూ. 10 లక్షలు వెచ్చించారనే వార్త ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే కాదు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మహానాడు అనేది టీడీపీ పార్టీ సిద్ధాంతాలను, క్రమశిక్షణను, సీనియర్ల త్యాగాలను స్మరించుకునే ఒక పవిత్రమైన వేదిక. అలాంటి వేదిక సాక్షిగా కుర్చీ కోసం వేలం జరిగిందనే వార్త పార్టీ నైతిక పతనానికి అద్దం పడుతోందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. క్రమశిక్షణకు మారుపేరైన పార్టీలో నైతిక విలువలు ఇంతలా దిగజారిపోవడంపై తమ్ముళ్లు సైతం అంతర్గతంగా మదనపడుతున్నారు. మరి దీనిపైన టీడీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -