- Advertisement -

ప్రియుడితో పట్టుబ‌డ్డ‌ భార్య గొంతు కోసి చంపిన భర్త!

- Advertisement -

వివాహేతర సంబంధాలు సంసారాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేస్తున్నాయో చూపించే మరో భయంకరమైన ఉదంతం తమిళనాడులో వెలుగుచూసింది. పరాయి పురుషుడితో పెట్టుకున్న అక్రమ సంబంధం కారణంగా ఒక ఇల్లాలు ప్రాణాలు కోల్పోగా.. ఆగ్రహంతో ఆమెను హతమార్చిన భర్త జైలు పాలయ్యాడు. చివరకు ఈ ఇద్దరి నడుమ ఏ పాపం తెలియని వారి ఐదేళ్ల పసివాడు అనాథగా మిగిలిపోయాడు. తమిళనాడులోని తిరుచ్చి (Trichy) నగరంలో జరిగిన ఈ ఘోర హత్య ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుచ్చికి చెందిన ధర్మరాజా, అక్షయ దంపతులు తమ ఐదేళ్ల కుమారుడితో కలిసి నివసిస్తున్నారు. అయితే, ఒక సెలూన్‌లో కలిసి పనిచేసే జోషువా అనే యువకుడితో అక్షయకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసింది. భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన ధర్మరాజా.. ఆమె తీరును గమనించి జోషువాతో ఉన్న అక్రమ సంబంధం గురించి తెలుసుకున్నాడు. కుటుంబ పరువు పోతుందని భావించి.. తన పద్ధతి మార్చుకోవాలంటూ అక్షయను భర్త పలుమార్లు హెచ్చరించాడు, గట్టిగా మందలించాడు. అయినప్పటికీ ఆమె తన తీరును మార్చుకోకుండా ప్రియుడితో గుట్టుచూడకుండా రాసలీలలు కొనసాగించింది.

ఈ క్రమంలోనే ధర్మరాజా ఇంట్లో లేని సమయం చూసి అక్షయ తన ప్రియుడు జోషువాను రహస్యంగా ఇంటికి రప్పించుకుంది. అయితే ఊహించని విధంగా ధర్మరాజా హఠాత్తుగా ఇంటికి రావడంతో.. భార్య అక్షయ తన ప్రియుడితో కలిసి శృంగారంలో మునిగితేలుతూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. కళ్లెదుటే జరుగుతున్న దారుణాన్ని చూసి తీవ్ర కోపాద్రిక్తుడైన ధర్మరాజా.. ఆవేశాన్ని అణచుకోలేక ఇంట్లో ఉన్న కత్తిని తీసుకుని భార్య అక్షయపై దాడి చేసి అత్యంత కిరాతకంగా ఆమె గొంతు కోసి హతమార్చాడు. ఆ సమయంలో జరిగిన ఘర్షణలో భయపడిపోయిన ప్రియుడు జోషువా.. అక్కడి నుండి ప్రాణభయంతో పారిపోయాడు.

హత్య అనంతరం ధర్మరాజా తనే స్వయంగా పోలీసులకు దొరికిపోయాడు. “ఒక పాడు వివాహేతర సంబంధం నా పచ్చని ఫ్యామిలీని పూర్తిగా నాశనం చేసింది.. ఇప్పుడు నా ఐదేళ్ల అమాయక కొడుకు పరిస్థితి ఏంటి? వాడిని ఎవరు చూసుకుంటారు?” అంటూ ధర్మరాజా పోలీసుల ముందు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘోరమైన ఘటనపై తిరుచ్చి పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని, నిందితుడైన ధర్మరాజాను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అక్కడి నుండి పరారైన ప్రియుడు జోషువా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -