సమిష్టి కృషితో ఆస్తిపన్ను వసూళ్లలో జీహెచ్‌ఎంసీ కొత్త రికార్డు సృష్టించిందని తెలిపారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి. జీహెచ్ఎంసీ చరిత్రలోనే అత్యధికంగా పన్ను వసూళ్లూ చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. ఆస్తి పన్ను వసూళ్లకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు, మెమోంటోలు అందజేసి, అభినందనలు తెలిపారు ఇలంబర్తి.
2 వేల కోట్లకు పైగా ఆస్తిపన్ను వసూలు చేయడంలో క్షేత్రస్థాయి అధికారులు బాగా పని చేశారని అన్నారు. జిహెచ్ఎంసికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి రికార్డ్ స్థాయిలో ఆస్తి పన్ను వసూల్లైన నేపథ్యంలో, అందుకు కృషి చేసిన రెవెన్యూ అధికారులు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, ఏ.ఎం.సి లు, డిప్యూటీ కమిషనర్లకు శుక్రవారం బంజారా హిల్స్ లోని బంజారా భవన్ లో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
2025-26 కి గాను 3 వేల కోట్ల టార్గెట్ తో ముందుకు వెళ్తున్నాం.. ఎస్టేట్స్ విభాగం నుంచి కూడా ఈసారి రెవెన్యూ పెరిగింది అన్నారు. ట్యాక్స్ కలెక్షన్ పెరిగితే జీహెచ్ఎంసీ లో మరిన్ని పనులు చేపట్టవచ్చు అన్నారు.