టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, రాజోలు నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న గొల్లపల్లి…పార్టీ పదవులకు మరియు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఈ సందర్బంగా తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు గొల్లపల్లి. జగన్‌కు మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. 1891లో కొత్తపేట సమితి అధ్యక్షునిగా క్రీయాశీలక రాజకీయాల్లోకి వచ్చానని లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్, వైఎస్ మంత్రివర్గంలో పనిచేశానని తెలిపారు.
ప్రతీకూల పరిస్థితుల్లో కూడా పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని నిర్వహించానని, ఎలాంటి చిన్న పొరపాటు లేకుండా పనిచేశానని తెలిపారు. కానీ తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించారని, నా ఆత్మగౌరవానికి భంగం కలిగిన నేపథ్యంలో పార్టీలో ఉండలేనని, తన రాజీనామాను అమోదించాలని లేఖలో కోరారు. గొల్లపల్లి రాజీనామాతో టీడీపీ గట్టి షాక్ తగిలినట్టేనని అంతా అభిప్రాయపడుతున్నారు.