ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ జరిగే క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది గుజరాత్ జెయింట్స్. ధర్మశాలలో ఆర్సీబీ (RCB) చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో పక్కా ప్రణాళికతో బరిలోకి దిగనుంది గుజరాత్. ఓ వైపు వైభవ్ విధ్వంసం మరోవైపు గిల్ క్లాసిక్ ..ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారోనని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఈ సీజన్లో గుజరాత్‌కు ఓపెనర్లు భారీ స్కోరు చేయడం కాగిసో రబడా,మహ్మద్ సిరాజ్ ప్రారంభంలోనే ప్రత్యర్థి బ్యాటర్లను దెబ్బకొట్టడం, రషీద్ ఖాన్/జాసన్ హోల్డర్ మిడిల్ ఓవర్లను నియంత్రించడం.. ఇది వారి గేమ్ ప్లాన్.2025 నుండి 210+ పరుగుల ఛేజింగ్‌లలో గుజరాత్ ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. గత మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో టైటాన్స్ బౌలర్లు 240 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ఇరు జట్ల బ్యాటింగ్‌ను పోల్చితే…సూర్యవంశీ-యశస్వి జైస్వాల్ జోడీ యొక్క దూకుడు…సుదర్శన్-గిల్ యొక్క క్లాసిక్ బ్యాటింగ్ శైలి కంటే మెరుగ్గా కనిపిస్తోంది. ముల్లాన్‌పూర్ లాంటి కాస్త పెద్ద మైదానం కావడంతో పవర్‌ప్లే స్కోర్లు చాలా కీలకం కానున్నాయి. ఒకవేళ రాజస్థాన్ టాప్ త్రీ బ్యాటర్లు రాణిస్తే గుజరాత్‌కు చాలా కష్టమవుతుంది.
గుజరాత్ జట్టుకు ఇతర బలమైన అంశాలు ఉన్నాయి. ఈ సీజన్ మిడిల్ ఓవర్లలో (7-15) అత్యధిక వికెట్లు తీసిన జట్టు గుజరాతే. వారి స్ట్రైక్ రేట్ అత్యుత్తమంగా ఉంది .డాట్ బాల్ శాతం కూడా ఎక్కువే. ఒకవేళ రాజస్థాన్ టాప్ ఆర్డర్ చేతిలో దెబ్బతిన్నా తిరిగి పుంజుకునే సత్తా గుజరాత్ బౌలింగ్‌కు ఉంది. హెడ్-టు-హెడ్ పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్ 7-3తో ముందంజలో ఉండగా 2025 నుండి ఇరు జట్ల రికార్డు 2-2తో సమానంగా ఉంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు అంచనా..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (కీపర్), రియాన్ పరాగ్ (కెప్టెన్), డోనోవన్ ఫెరీరా, దసున్ శనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, బర్గర్, యష్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ, సుశాంత్ మిశ్రా/తుషార్ దేశ్‌పాండే/రవి బిష్ణోయ్.
గుజరాత్ టైటాన్స్
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (కీపర్), నిశాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్/సాయి కిషోర్, కాగిసో రబడా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఐపీఎల్ 2026లో జరిగిన గత 7 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లను మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కాబట్టి టాస్ గెలిస్తే గుజరాత్ మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్ విధానం వచ్చినప్పటి నుండి క్వాలిఫైయర్-2 (Q2) గెలిచిన జట్లు మూడుసార్లు విజేతగా నిలిచాయి.
గతంలో ప్లేఆఫ్స్‌లో ఆర్ఆర్ మరియు జీటీ రెండుసార్లు తలపడ్డాయి (2022 క్వాలిఫైయర్-1 మరియు ఫైనల్) — ఈ రెండింటిలోనూ గుజరాత్ జట్టే విజయం సాధించింది.
