- Advertisement -

కేటీఆర్‌పై రేవంత్ కక్ష సాధింపు

- Advertisement -

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని ఆయన విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి మరో చిల్లర డ్రామాకు ప్రయత్నిస్తున్నాడు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఫార్ములా ఈ రేస్ పూర్తి పారదర్శకతతో జరిగిందని, దానిపై కాంగ్రెస్ సర్కార్ రెండేళ్లుగా కోడిగుడ్డుపై ఈకలు పీకుతుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచిన కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించి, ఆయనను ఇబ్బంది పెట్టడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు.కేటీఆర్‌కు పార్టీ పూర్తి అండగా ఉంటుందని…రేవంత్ రెడ్డి దుర్మార్గ వైఖరిని తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ఆయన ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -