జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం (నవంబర్ 20) పాట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో 10వ సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
నితీష్ కుమార్ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేశారు.నితీష్ కుమార్‌తో పాటు మరో 26 మంది ఎమ్మెల్యేలు బీహార్ మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సహా ఎన్డీఏలోని పలువురు అగ్ర నాయకులు హాజరయ్యారు.
మంత్రుల పూర్తి జాబితా..
బీజేపీ నుండి సామ్రాట్ చౌదరి,విజయ్ కుమార్ సిన్హా,దిలీప్ జైస్వాల్,మంగళ్ పాండే,సంజయ్ సింగ్ టైగర్,రమ నిషాద్,అరుణ్ శంకర్ ప్రసాద్,రామ్ కృపాల్ యాదవ్, నితిన్ నబిన్,సురేంద్ర ప్రసాద్ మెహతా,లఖేంద్ర కుమార్ రౌషన్,శ్రేయసి సింగ్,నారాయణ్ ప్రసాద్,డాక్టర్ ప్రమోద్ కుమార్ చంద్రవంశి ఉన్నారు.
జేడీయూ నుండి లేషి సింగ్ ,మదన్ సాహ్ని,సునీల్ కుమార్,మొహమ్మద్ జమా ఖాన్,విజయ్ కుమార్ చౌదరి,బిజేంద్ర ప్రసాద్ యాదవ్,శ్రవణ్ కుమార్,అశోక్ చౌదరి ఉన్నారు. అలాగే సంజయ్ కుమార్ పాశ్వాన్ (LJP-RV),సంజయ్ కుమార్ సింగ్ (LJP-RV),సంతోష్ కుమార్ సుమన్ (HAM),దీపక్ ప్రకాష్ (RML) ఉన్నారు.
