Sunday, May 4, 2025
- Advertisement -

ఇచ్ఛాపురం..ఈసారి వైసీపీదే!

- Advertisement -

ఏపీ రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా వైఎస్ ఫ్యామిలీకి సెంటిమెంట్ ఈ నియోజకవర్గం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు జగన్ వరకు చేపట్టిన పాదయాత్రలను విజయతీరాలకు చేర్చింది ఇచ్చాపురమే. అయితే ఇక్కడి నుండి ఇప్పటివరకు వైసీపీ జెండగా ఎగిరింది లేదు. నియోజకవర్గం ఏర్పడిన దగ్గరి నుండి 9 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి తప్ప అన్నిసార్లు విజయం టీడీపీదే.

ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాలు ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట ఉన్నాయి. 2 లక్షల 67 వేల 108 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అశోక్ తన సమీప వైసీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌పై 7 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లోనూ అశోక్‌ విజయం సాధించారు. దీంతో ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.

అయితే వైసీపీ ఈసారి ఇక్కడి నుండి మహిళా అభ్యర్థిని బరిలోకి దించింది. సాయిరాజ్ భార్య విజయ సాయిరాజ్ పోటీ చేస్తుండగా ఈ సారి గెలిచి టీడీపీ కంచుకోటను బద్దలు కొడతానిన చెబుతోంది. పార్టీ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబట్టి సీఎం జగన్‌కు గిఫ్ట్ ఇస్తానని చెబుతోంది. తానని.. ఇచ్ఛాపురం నియోజకవర్గాన్ని సీఎం జగన్‌కు గిప్ట్‌గా ఇస్తానని చెబుతున్నారు వైసీపీ అభ్యర్థిని పిరియా విజయ.కంచుకోటను కాపాడుకోవాలని టీడీపీ.. ఈ నియోజకవర్గం నుండి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పాలని వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. రెడ్డి , యాదవ, మత్సకార సామాజికవర్గ ఓట్లు ఎక్కువగా ఉండగా వీరు ఎవరికి జై కొడితే వారిదే గెలుపు కానుంది. జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని పిరియా విజయ ధీమాగా ఉన్నారు. మరి ఈసారి ఇచ్చాపురంలో జెండా పాతేది ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -