Thursday, May 9, 2024
- Advertisement -

ఆ జెడ్పీటీసీలు అదృష్టవంతులు?

- Advertisement -

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్‌. ఇందులో భాగంగా ఇప్పటివరకు 50 అసెంబ్లీ, 9 పార్లమెంట్ స్‌థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇక తాజాగా మూడో జాబితా రిలీజ్ చేయగా 6 ఎంపీ స్థానాలకు, 15 అసెంబ్లీ స్థానాలతో కలిపి మొత్తం 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది.ఈ జాబితాలో సామాజిక న్యాయం పాటించారు జగన్. 15 అసెంబ్లీ స్థానాలకు గాను 11 స్థానాలను బిసీలకు, ఒక స్థానం మైనార్టీ, మూడు స్థానాల్లో ఓసీలకు కేటాయించారు.

ఇక మూడో జాబితాలో పలువురు జడ్పీటీసీలు లక్కీ ఛాన్స్ కొట్టేశారు. పిరియా విజయ, ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి,బూసినే విరూపాక్షిలకు అసెంబ్లీ సీటు కేటాయించారు జగన్‌. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఇచ్చాపురం నుండి పిరియా విజయ భర్త పిరియా సాయిరాజ్‌ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయనకు సీటు ఇవ్వకుండా ఆయన భార్య, జెడ్పీ చైర్‌ పర్సన్‌ గా పిరియా విజయకు సీటు కేటాయించారు.

అలాగే ప్రస్తుతం కడప జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్న ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డిని రాజంపేట అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆకేపాటి అమర్‌ నాథ్‌ రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోఓటమి పాలుకాగా 2019లో ఆయనకు సీటు ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడు ఆకేపాటికి సీటు ఇచ్చారు జగన్‌. కర్నూలు జిల్లా ఆలూరు సీటును విరూపాక్షికి కేటాయించారు. ఆలూరు ఎమ్మెల్యేగా గుమ్మనూరు జయరాంను కర్నూల్ ఎంపీగా పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు జగన్. మొత్తం మీద ముగ్గురు జెడ్పీటీసీలు ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -