తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు కొత్త కాదు. టీడీప,కాంగ్రెస్,వైసీపీ పార్టీ ఏదైనా అధికారంలోకి వచ్చేందుకు దోహదపడటంలో సాయ పడింది పాదయాత్రలే. అయితే పాదయాత్రలు చేసి కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది అధికారంలోకి రాకపోయారు. కానీ విచిత్రం ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి,జగన్,షర్మిల పాదయాత్ర మొదలు పెట్టింది ఎక్కడినుండైన ముగించింది మాత్రం ఇచ్చాపురంలోనే.
అయితే వైఎస్ కుటుంబం సెంటిమెంట్ ఏమో కానీ టీడీపీ నేతలు మాత్రం పాదయాత్రలో ఇచ్చాపురం మొఖం కూడా చూడలేదు. నాడు చంద్రబాబు పాదయాత్ర చేసిన నేడు లోకేష్ చేస్తున్న ఇచ్చాపురం సెంటిమెంట్‌కు దూరంగా ఉంటున్నారు.అయితే ఇచ్చాపురంలో టీడీపీ ట్రాక్ రికార్డు మాత్రం అదుర్స్. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటివరకు 9 సార్లు ఎన్నికలు జరుగగా 8 సార్లు టీడీపీనే విజయం సాధించింది.
అయితే పాదయాత్రలో మాత్చం ఇచ్చాపురంను తాకలేదు. చంద్రబాబు 2012లో పాదయాత్ర స్టార్ట్ చేసి 2013 ఏప్రిల్ లో విశాఖలో పాదయాత్ర ముగించారు.ఇప్పుడు తాజాగా లోకేష్ కూడా తన పాదయాత్రను ఇచ్చాపురంలో కాకుండా విశాఖలో ముగిస్తున్నారు. ఇచ్చాపురం టీడీపీకి కంచుకోట అయినా వైసీపీకే కలిసి రావడం విశేషం.
వైఎస్సార్ ఫ్యామిలీలో పాదయాత్ర చేసిన ముగ్గురూ ఇచ్చాపురం దాకా పాదయాత్ర చేయగా చంద్రబాబు ఫ్యామిలీ నుండి ఇచ్చాపురం రాకుండానే పాదయాత్ర ముగుస్తోంది.