Friday, May 17, 2024
- Advertisement -

లోకేష్ అరెస్ట్..లాస్ట్ ఆప్షన్ ఇదే!

- Advertisement -

2014 నుండి 2019 వరకు టీడీపీ హయాంలో జరిగిన అవినీతి బాగోతం అంతా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్ నెట్‌,ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం ఇలా పలు కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అప్పుడు మంత్రిగా కీలకంగా వ్యవహరించిన లోకేష్ పేర్లు ప్రధానంగా ప్రస్తావించింది సీఐడీ.ఇక పలు కేసుల్లో ఏ1గా చంద్రబాబు ఉండగా లోకేష్‌ పేరును సైతం చేర్చింది.

ఫైబర్ నెట్ స్కాంతో పాటు తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా లోకేష్‌ను చేర్చడంతో ఆయన్ని అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ తర్వాత జైలుకు వెళ్లేది లోకేషేనని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్ ఢిల్లీలోనే ఉంటున్నారని..ఏపీకి రావడం లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా లోకేష్ పేరును మరో స్కాంలో ప్రస్తావించడంతో ఆయన అరెస్ట్ ఖాయం కాగా ఇక లోకేష్ ముందున్న లాస్ట్ ఆప్షన్ పాదయాత్ర కొనసాగించడమేనని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్‌ సానుభూతిని సరిగా క్యాచ్‌ చేసుకోలేకపోయామనే భావనలో ఉన్న టీడీపీ నేతలు, లోకేష్ అరెస్ట్ ని ఎలా ఎదుర్కోవాలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా లోకేష్ పాదయాత్రను చేపట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇక ఈసారి పాదయాత్రకు భారీగా జనసమీకరణ చేయాలని, ఒక వేళ జనం మధ్యలో చినబాబును అరెస్ట్ చేస్తే ఈసారి సానుభూతి వర్కవుట్ అవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. అయితే టీడీపీ నేతల రాజకీయ ఎత్తుగడ బాగానే ఉన్నా ఒకవేళ లోకేష్‌ ఏపీలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ చేస్తే ఆ పార్టీ నేతల ఎత్తుగడ పూర్తిగా బుమారాంగ్ అయ్యే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. మొత్తంగా లోకేష్‌ అరెస్ట్ కావడం ఖాయమని టీడీపీ నేతలే చెబుతున్న నేపథ్యంలో రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -