ఛాంపియన్స్ ట్రోఫి 2025కి సర్వం సిద్ధమైంది. ఈ నెలలో జరిగే ఈ టోర్ని కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్‌లో హై ఓల్టేజ్ మ్యాచ్ భారత్ వర్సెస్ పాకిస్థాన్. ఈ నెల 23న దుబాయ్ వేదికగా జరగనుండగా ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు అన్ని గంటల్లోనే అమ్ముడయ్యాయి.
ఈ మ్యాచ్ గరిష్ట టికెట్ ధర రూ. 1.20 లక్షలు. ఈ టికెట్లు కూడా పూర్తిగా అమ్ముడుపోయాయంటే ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను సోమవారం సాయంత్రం ఆన్‌లైన్ వేదికగా అందుబాటులోకి తీసుకురాగా మిషాల్లోనే సేల్ అయ్యాయి. ఎక్కువ మంది రూ. 47 వేలకు సంబంధించిన సీట్ల కోసం ఆసక్తి చూపించగా రూ. 1.20 లక్షల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి.
బంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో భారత్ గ్రూప్-ఏలో ఉండగా గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. 23న పాకిస్థాన్‌తో తలపడనుంది. వన్డే ప్రపంచకప్ 2023 తర్వాత ఈ ఫార్మాట్‌లో భారత్-పాక్ తలపడటం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలోనే భారత్ – పాకిస్థాన్ మ్యాచ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది.