Monday, June 17, 2024
- Advertisement -

46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది.ఏ పార్టీకి వారే ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా విజయం ఎవరిని వరిస్తుందోనన్న సెంటిమెంట్ పైనే జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ప్రధానంగా ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం అన్నది సెంటిమెంట్. గత 46 ఏళ్లుగా ఇదే జరుగుతూ వస్తోంది.

ఏలూరు , భీమవరం , ఉంగుటూరు,పోలవరం ఈ నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీనే అధికారం వరిస్తోంది. 1978లో కాంగ్రెస్,1983, 1985లో టీడీపీ ,1989లో కాంగ్రెస్,1994, 1999లలో టీడీపీ ఈ నాలుగు స్థానాల్లో గెలుపొందింది.ఇక 2004,2009లో ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

2014లో ఈ నాలుగు చోట్ల టీడీపీ గెలవగా చంద్రబాబు సీఎం అయ్యారు. ఇక 2019లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా ఆపార్టీనే అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఈ నాలుగు నియోజకవర్గాల్లో గెలిచేది ఎవరనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బెట్టింగ్ ఓ రేంజ్‌లో సాగుతోంది. మరి 46 ఏళ్ల సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా ఆ సెంటిమెంట్‌కు బ్రేక్ పడుతుందా వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -