Monday, May 6, 2024
- Advertisement -

బాబు సీటులో బాలయ్య!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్,జైలులో ఉన్నారు. ఇప్పుడు వాట్ నెక్ట్స్…టీడీపీ నేతలను వేధిస్తున్న ప్రశ్న ఇదే. టీడీపీకి జవసత్వాలు తేవాలంటే జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి రావాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‌ తెరపైకి వస్తే లోకేష్ ప్రాబల్యం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతా తానై చూస్తున్నారు బాలకృష్ణ.

అంతేగాదు ఇప్పటివరకు చంద్రబాబు ఆసీనులైన సీటులో కూర్చున్నాను బాలయ్య. చంద్రబాబు అరెస్ట్ తర్వాత భవిష్యత్ కార్యచరణపై పార్టీ నేతలతో చర్చించారు. టీడీపీ ఆఫీసులో మెయిన్ ఛైర్ లో బాలయ్య కూర్చున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కూర్చున్నారు. అందరి అభిప్రాయాలూ పూర్తిగా విన్న బాలయ్య కొన్ని కీలక సూచనలు చేశారు. ఇక బాలకృష్ణ నుండి ఇలాంటి పొలిటికల్ నిర్ణయాలను ఊహించని నేతలు అంతా షాక్‌కు గురయ్యారట.

బాలకృష్ణ కీలక మీటింగ్ తర్వాత పార్టీ నేతల్లో కాస్త ధైర్యం పెరిగింది. చంద్రబాబుకు బెయిల్ రాకపోతే ఆ స్థానంలో బాలకృష్ణేనంటూ నేతలంతా అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు లోటు పూడ్చే సత్తా బాలకృష్ణకే ఉందని భావిస్తున్నారు. బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్, ఎన్టీఆర్ వారసుడిగా ఇది టీడీపీకి కలిసి వస్తుందని భావిస్తున్నారు.

మరికొంతమంది టీడీపీ నేతలు అన్నగారి నిజమైన వారసుడు వచ్చేశాడని చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇది అసలైన టీడీపీ అని…బాలయ్య నేతృత్వంలో పార్టీకి జోష్ వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక బాలకృష్ణ ఎంట్రీతో జూనియర్ ఎన్టీఆర్‌ రావాలనే నినాదం పక్కకుపోయిందనే చెప్పుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -