- Advertisement -

ఇంత జరిగినా బీజేపీతో పొత్తుకే సై అంటున్న బాబు!

- Advertisement -

ఏపీలో ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇప్పటివరకు టీడీపీ,జనసేన,బీజేపీ కలిసి పోటీచేస్తాయనే సంకేతాలు ఇస్తూ వచ్చాయి ఈ మూడు పార్టీలు. కానీ తాజాగా చంద్రబాబు అరెస్ట్‌తో పొలిటికల్ గేమ్ పూర్తిగా ఛేంజ్ అయింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జగన్ డైరెక్షన్‌లో కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతోనే ఇదంతా జరిగిందనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలుత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన బీజేపీ తర్వాత ఎలాంటి నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే టీడీపీ పిలుపుఇచ్చిన బంద్‌లో జనసేనతో పాటు వామపక్షాలు పాల్గొన్నాయి. దీంతో ఏపీలో కొత్త పొత్తు పొడవనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీజేపీని నమ్ముకొని లాభం లేదని ఆ పార్టీ వల్లే టీడీపీకి డ్యామేజ్ జరిగిందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇక అధినేత అరెస్ట్ వెనుక మోడీ హస్తం ఉందని ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కంటే తమతో కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్లడం బాగుంటుందని నేతలు అనుకుంటున్నారట. ఇందులో భాగంగానే జనసేన,వామపక్షాలు,టీడీపీ పొత్తు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీతో పొత్తు వైపే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారట. అరెస్ట్ కు ముందువరకు కూడా పార్టీ నేతలతో ఇదే సూచించారట. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీజేపీతో వైరం పెట్టుకోవడం మంచిది కాదని,నేతలెవరు పొత్తులకు సంబంధించిన ప్రస్తావన కానీ, మీడియా ముందు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని క్లీయర్ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారట. అయితే క్షేత్ర స్ధాయిలో టీడీపీ కార్యకర్తలు మాత్రం బీజేపీ అంటేనే రగిలిపోతున్నారు. చంద్రబాబు అరెస్టన్నది బీజేపీ పెద్దలకు తెలీకుండా జరగదని అర్ధమైపోయిన తర్వాత కూడా ఆపార్టీతో పొత్తుకు వెంపర్లాడటం సరికాదని నేతలతో చెబుతున్నారు. మరి దీనిపై టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -