Sunday, May 5, 2024
- Advertisement -

పొలిటికల్ మల్టీస్టారర్‌ హిట్ అయ్యేనా?

- Advertisement -

టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ల ట్రెండ్ కొత్తేమీ కాదు. ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే ఆ హీరో ఫ్యాన్స్‌కు పండగే. ఇక ఇద్దరు హీరోలు కలిసి స్టెప్పులేస్తే, ఫైట్ చేస్తే వచ్చే కిక్కే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇదే నిరూపితమైంది. కానీ రాజకీయాల్లో ఇద్దరు హీరోలు కలిసివస్తే..ఆ పొలిటికల్ మల్టీస్టారర్ హిట్టు అవుతుందా..?అంటే అంతుచిక్కని ప్రశ్నే. ఇంతకీ ఎవరు ఆ హీరోలు అనుకుంటున్నారా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

తెరపై వీరిద్దరి కాంబో సూపర్ హిట్. బుల్లితెరపై ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్ షోలో వీరిద్దరి ఎపిసోడ్ ఎప్పటికి ఎవర్‌గ్రీనే. అత్యధిక వ్యూస్ సాధించిన ఎపిసోడ్‌గా బాలయ్య – పవన్‌ ఎపిసోడ్ నిలిచింది. అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత టీడీపీతో పొత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు పవన్.

దీంతో పవన్ ప్రకటన తర్వాత రాజకీయాల్లో మరింత వేడెక్కాయి. టీడీపీ – జనసేన కంబైండ్ గా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేశాయి. దీంతో ఇకపై ప్రజాక్షేత్రంలో ఒకే వేదికపై పవన్ , బాలయ్య కనిపించనున్నారు. బాబు దిశానిర్దేశకత్వంలో వీరిద్దరూ ఏ విధంగా పనిచేయనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ వ్యవహారశైలీలో పూర్తిగా మార్పువచ్చింది. చంద్రబాబు గొప్పనేత అని ప్రొజెక్టు చేశారు. దీంతో టీడీపీకి కూడా పవనే పెద్ద దిక్కు కానున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదిఏమైనా ప్రజాక్షేత్రంలో పవన్ – బాలయ్య మల్టీస్టారర్ హిట్ అవుతుందా లేదా వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -