Thursday, May 9, 2024
- Advertisement -

సీఎం కేసీఆర్‌ను ఫాలో అవుతున్న జగన్!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. ఇటు తెలంగాణ అటు ఏపీలో అధికార పార్టీలే తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని సర్వేలే తేల్చిచెబుతున్నాయి. ఇక ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఎదుర్కొవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు ఏపీ సీఎం జగన్‌. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్,బీజేపీలను ఎదుర్కోవడంలో సీఎం కేసీఆర్ రూటే సపరేటు. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను ఎండగట్టడమే కాదు అసెంబ్లీ వేదికగా ఆ పార్టీల తప్పును చూపెట్టడంలో కేసీఆర్ స్టైలే వేరు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి గత పాలకుల హయాంలో జరిగిన దొపిడిని కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. తెలంగాణ యాసలో పంచ్‌లు వేస్తూ, అందరికి అర్ధమయ్యేలా చేయడంలో కేసీఆర్ స్టైలే వేరు. ఈ ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

తాజాగా ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి. త్వరలోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశాలు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే అటు ప్రజాక్షేత్రంలో ఇటు అసెంబ్లీ వేదికగా టీడీపీ, బాబు వైఖరిని ఎండగట్టాలని భావిస్తున్నారు జగన్.

గత నాలుగున్నరేళ్ళుగా ఏపీలో జరిగిన అభివృద్ధి గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఒక్కో రోజూ ఒక్కో అంశం మీద ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక చంద్రబాబు అవినీతిపై ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రస్తావించిన జగన్…మరోసారి ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని టాక్. టీడీపీ అవినీతిని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించడం ద్వారా ఆ పార్టీని ప్రజల్లో దోషులుగా నిలబెట్టేప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అంతేగాదు అసెంబ్లీ వేదికగా పలు సంచలన విషయాలను ప్రస్తావించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -