Sunday, April 28, 2024
- Advertisement -

ఆలోచించాల్సిందే..ఎన్టీఆర్ కంటే పవన్ గొప్పోడా..?

- Advertisement -

ఒకప్పుడు పవన్‌ కళ్యాణ్ వారి దృష్టిలో పావలా కళ్యాణ్. ఎందుకు పనికి రాని వ్యక్తి. అంతేందుకు జనసేన – టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు పావలా కళ్యాణే టీడీపీకి దిక్కయ్యారు. ఎంతలా అంటే చంద్రబాబు తర్వాత పవనే అనే అంతలా. ఎందుకింత మార్పు అంటే రాజకీయ అవసరం తప్ప మరే కారణం లేదని చెప్పాలి.

అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత సినీ పరిశ్రమ నుండి ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుండి ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ ఒక్కమాట కూడా మాట్లాడని పరిస్థితి.దీనిపై అనేక ప్రెస్ మీట్‌లలో టీడీపీ నేతలకు ఎదురైన ప్రశ్న కూడా ఇదే. జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడం లేదనే. అయితే ఈ ప్రశ్నలకు విసిగిపోయే లేదో అల్లుడు లోకేష్‌పై ప్రేమో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్‌ స్పందించక పోవడంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చనీయాంశంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఏంటీ ఐ డోంట్ కేర్ అంటూ పరుష పదజాలంతో బాలయ్య మాట్లాడిన తీరు బట్టి చూస్తే నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయని స్పష్టంగా అర్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. ఎన్టీఆర్‌ని తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లగొట్టిందే చంద్రబాబు అని …చంద్రబాబుని అరెస్ట్ చేస్తే.. ఎన్టీఆర్ స్పందించాలి కదా.. ఎంతైనా సొంత ఫ్యామిలీ కదా అని చాలామంది అంటున్నారు కానీ అసలు ఎన్టీఆర్‌ని ఫ్యామిలీ సభ్యుడిగానే చూడలేదని మండిపడ్డారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే.. ఎన్టీఆర్‌కి ఏం సంబంధం? అసలు ఆయన ఎందుకు స్పందించాలి? అన్నారు. తనకు తెలిసీ జూనియర్ ఎన్టీఆర్‌ని తమ కుటుంబం అని నందమూరి, నారా ఫ్యామిలీలు అనుకోలేదు అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కి స్టార్ డమ్‌ వచ్చిన తర్వాత వీళ్లంతా వచ్చారు…చంద్రబాబు పిలిస్తే టీడీపీకి ప్రచారం చేసి పార్టీ కోసం ప్రాణం పెట్టిన మనిషి ఎన్టీఆర్ అన్నారు. అలాంటి మనిషిని వదిలేసి పవన్‌ ఇంటికి వెళ్లారు…ఇవాళ ఎన్టీఆర్‌ స్పందించడం లేదని ఎందుకింత రచ్చ చేస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు.

ఇంటి మనిషి ఎన్టీఆర్‌ని వదిలి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లినప్పుడు.. ఎన్టీఆర్ ఇప్పుడెందుకు వస్తాడు? ఎందుకు రావాలి? ఎన్టీఆర్‌ని వదులుకున్నట్టే కదా అని తమ్మారెడ్డి ప్రశ్నించగా ఇది ఆలోచించాల్సిన విషయమేనని నెటిజన్లు చెబుతున్న పరిస్థితి నెలకొంది. తమ్మారెడ్డి చెప్పిన మాటలు అక్షరాలా నిజమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -