Tuesday, May 7, 2024
- Advertisement -

Pawan:బీజేపీకి దెబ్బేసి..టీడీపీకి అంతా తానై!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ముందు వరకు జనసేనాని పవన్ బీజేపీ మనిషి. ఎన్డీయే కూటమిలో ఉంటూనే ఏపీ బీజేపీకి పెద్ద దిక్కుగా మారారు. ఇక బీజేపీ నేతలు సైతం పవన్‌తో కలిసి వెళ్తే తమకు లాభం జరుగుతుందని భావించారు. కానీ బాబు అరెస్ట్ తర్వాత ఓవర్‌నైట్‌లో స్టోరీ మారిపోయింది. ఎవరితో సంప్రదింపులు లేవు సోలో పర్ఫార్మెన్స్‌గా టీడీపీతో పొత్తును అనౌన్స్‌ చేసేశారు. తర్వాత జనసైనికుల మీటింగ్ పెట్టి పొత్తుకు గల కారణాలను వివరించి కన్విన్స్ చేశారు.

ఇక బీజేపీతో పొత్తు లేదని అధికారికంగా ప్రకటించిన పవన్‌ తన తర్వాతి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల పంపకాలపై దృష్టి సారించారు. అయితే టీడీపీకి మొత్తం 175 సీట్లలో బలం ఉంది. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే పోటీచేసేందుకు నాయకులు ఉన్నారు. కానీ జనసేనకు అలాంటి పరిస్థితి లేదు. 175 స్ధానాల్లో పోటీ చేసేందుకు నాయకులు లేకపోయినా తానే టీడీపీకి దిక్కు అని ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు పవన్‌.

జనసేనకు పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. సీట్ల సంఖ్యపై క్లారిటీ వస్తే పోటీచేసే స్ధానాలపై కూడా క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారో తెలియక టీడీపీ నేతలు తికమకపడుతున్నారు. ఒకవేళ జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే తమకు ఎసరు వస్తుందని లోలోపల మదనపడుతున్నారు. వాస్తవానికి జనసేనకు గోదావరి జిల్లాలలో మాత్రమే కొంత బలం. పవన్ సామాజిక వర్గంతో పాటు అభిమానుల బలం ఉండటం ఈ జిల్లాల్లో కొంత ప్లస్ పాయింట్. అంతమాత్రానికే రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీకి నష్టం కలుగుతుంది అని వాదించే వారు లేకపోలేదు.

అందుకే టీడీపీ బలంగా ఉన్న చోట జనసేనకు ఎట్టిపరిస్థితుల్లో సీటు ఇవ్వొద్దని టీడీపీ సీనియర్లను వేడుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు జిల్లా టూర్లతో పాటు, లోకేష్ పాదయాత్ర వల్ల మంచి రెస్పాన్స్ వచ్చిందని ..జనసేనతో పొత్తు వల్ల లాభం లేదని చెబుతున్నారట. పవన్ కు అంత సీన్ లేదని నేతల వద్ద వాపోతున్నారట. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీకి జనసేనాని పవన్‌ తప్ప మరె ఆప్షన్ లేకపోవడంతో దీనిని క్యాచ్ చేసుకుని వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీచేయాలని భావిస్తున్నారు పవన్. మరి పవన్ అనుకున్న నెంబర్ గేమ్ సీట్లు సాధిస్తారా లేదా అన్నది వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -