Thursday, June 13, 2024
- Advertisement -

మంత్రివర్గంలోకి కోదండరామ్‌..పార్టీ విలీనమేనా?

- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలీలో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే పాలనలో తన మార్క్ చూపిస్తున్న రేవంత్..ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు. ఇక తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు నామినేటెడ్ పోస్టులను ఆశిస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణ జనసమితి కొదండరామ్‌, సీపీఐకి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో తొలి దశలో ప్రొ కొదండరామ్‌కు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీ చేస్తారని తెలుస్తోంది. ఇక తాజాగా తెలంగాణ రాజకీయాల్లో ఓ న్యూస్ వైరల్‌గా మారింది. కొదండరాం తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే కాదు ఆయనకు మంత్రి పదవి ఇస్తారనే టాక్ నడుస్తోంది.

ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానాన్ని అద్దంకి దయాకర్ కి ఇవ్వాలని నిర్ణయించారు. రెండో స్థానం కోసం అనిల్, వేణుగోపాల్, మహేశ్ కుమార్ గౌడ్, చిన్నారెడ్డి, కోదండరెడ్డిల మధ్య పోటీ ఉంది. ఇంకా ఆరుగురిని కేబినెట్ లో తీసుకునే ఛాన్స్ ఉండటంతో కొదండరాం పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -