రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జగన్. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డులో మామిడి రైతులను పరామర్శించారు జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే బంగారుపాళ్యం వచ్చానని తెలిపారు.
రైతులను కలువకుండా ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు… రైతుల తలలు పగులగొడతారా? 1200 మందిని జైల్లో పెడతారా? చెప్పాలన్నారు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేస్తాడు… అప్పుడు నేనే మీ తరఫున పోరాటం చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. కూటమి ప్రలోభాలు, లంచాలకు పోలీసులు లొంగవద్దు
అన్నారు.
మామిడి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది అని… ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు అన్నారు. కిలో మామిడి 2 రూపాయలా? ఇదేం దారుణం.. కర్ణాటక రాష్ట్రంలో కిలో మామిడి రూ.16కు కేంద్రం కొనుగోలు చేసిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?… వైయస్ఆర్‌సీపీ హయాంలో కిలో రూ.22 నుంచి రూ.29కు కొన్నాం అన్నారు.
రైతుల సమస్యలపై మాట్లాడితే భయమెందుకని ప్రశ్నించారు. కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయారని చెప్పారు. వైయస్ జగన్ వస్తున్నాడని తెలిసి, ఇక్కడ 2 వేల మంది పోలీసులను మొహరించి, రైతులను రానీయకుండా అడ్డుకున్నారు అన్నారు.
