మా ప్రభుత్వ హయాంలో కిలో మామిడి రూ.29 కి కొంటే, ఇప్పుడు కనీసం రూ.12 కూడా రావడం లేదు అన్నారు మాజీ సీఎం జగన్. ఇంకా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందడం లేదు. నాడు ఆర్బీకే వ్యవస్థ ప్రతి అడుగులో రైతులకు తోడుగా ఉండేవి. కానీ, ఈ ప్రభుత్వం ఆ వ్యవస్థను నిర్వీరం చేసింది అన్నారు. ఇవాళ అన్ని వ్యవస్థలునిర్వీర్యమయ్యాయి అన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి అని…. మొత్తం పంటను ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేసి, మామిడి రైతులను ఆదుకోవాలి అన్నారు.లేని పక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడుతాం అని హెచ్చరిక జారీ చేశారు.
రైతుల తల పగలగొట్టారు. అసలు మీరు మనుషులేనా?.. ఎవరికి ఏ సమస్య వచ్చినా జగన్ పలుకుతున్నాడు. మిర్చి, పొగాకు, మామిడి రైతుల సమస్యలపై జగన్ మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎవరికి ఏ సమస్య వచ్చినా, జగన్ ముందు ఉంటున్నాడు అన్నారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే ఇది గుర్తు పెట్టుకొండి అని హెచ్చరించారు. .
మే మొదటి వారంలో మామిడి మొదలుపెట్టాలి కానీ, ఆ పని ఎందుకు చేయలేదు? అన్నారు. జూన్ రెండో వారం తర్వాత మామిడి కొనుగోలు చేయడంతో.. మొత్తం పంట మార్కెట్‌ను ముంచెత్తింది. దీంతో కంపెనీలు ధరలు తగ్గించాయి అన్నారు. దీంతో మామిడి రైతులకు దిక్కు తోచడం లేదు. చిత్తూరు జిల్లాలో 52 పల్ప్ కంపెనీలు ఉన్నాయి. కానీ రైతులకు ధర రావడం లేదు అన్నారు.
