ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు కాపులకు తానే బ్రాండ్ అంబాసిడర్‌ని అనే ఫిలవుతున్న పవన్‌కు సీఎం జగన్ స్కెచ్ పెట్టనున్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకొచ్చేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు జగన్.
2009లో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ముద్రగడను తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తీసుకురావడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ముద్రగడ కుమారుడికి వైసీపీ టికెట్ ఇచ్చి ఎన్నికల్లో పోటి చేయించనుండటంతో పాటు పద్మనాభంను పెద్దల సభకు పంపనున్నారట జగన్.
ఈసారి ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఓ వైపు సిట్టింగ్‌ల మార్పు మరోవైపు సామాజిక వర్గాల వారిగా ఓటర్లను వైసీపీ వైపు తిప్పుకునేలా పక్కా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే పవన్ సామాజిక వర్గం కాపు ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న ముద్రగడను వైసీపీలో చేర్చుకుని పవన్‌కు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక పవన్ ఎక్కడి నుండి పోటీ చేస్తే అక్కడి నుండి ముద్రగడను పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట వైసీపీ అధినేత. మొత్తంగా ముద్రగడ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారగా జగన్ వేసిన స్కెచ్‌తో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచిచూడాలి.