Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబు చుట్టూ స్టార్ క్యాంపెయినర్లే!

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం జగన్. అనంతపురం జిల్లా ఉరవకొండలో నాలుగో విడత వైఎస్‌ఆర్‌ ఆసరా పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన జగన్..చంద్రబాబు చుట్టూ స్టార్ క్యాంపెయినర్లే ఉన్నారన్నారు. చంద్రబాబుకు మంచి చేసిన చరిత్ర లేదని, ఆయనదంతా మోసాల చరిత్రేనని ధ్వజమెత్తారు.

చంద్రబాబుకు అన్ని పార్టీల్లో రకరకాల రూపాల్లో బినామీ స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో సహా వివిధ పార్టీలో స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారని పురందేశ్వరిపై విమర్శలు చేశారు.
రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలో చేరిన చంద్రబాబు అభిమానులు.. ఆయనను జాకీ పెట్టి లేపేందుకు తెగ కష్టపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పక్క రాష్ట్రానికి చెందిన దత్తపుత్రుడు పవన్‌ టీడీపీకి దిక్కయ్యాడన్నారు. తనకు స్టార్ క్యాంపెయినర్లు లేరని …80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు తనకు స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని చెప్పారు. మీకు మంచి జరిగితే స్టార్ క్యాంపెయినర్లుగా రండి..మీ బిడ్డను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జతకట్టమే వారి అజెండా.. జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా అని స్పష్టం చేశారు జగన్. ప్రతి అడుగులో కూడా మహిళల సంతోషం కోసమే తమ ప్రభుత్వం తపన పడుతోందన్నారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -