Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు..కోమటిరెడ్డి సంచలనం!

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌ని కూల్చే కుట్ర జరుగుతోందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖండించగా తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కోమటిరెడ్డి. దీంతో పొలిటికల్ వర్గాల్లో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్ గఢ్ లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే తన మీద జగదీశ్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జి విచారణ తర్వాత కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు వెళుతుందని..అంతే తప్ప తమ ప్రభుత్వం పడిపోదన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లో పది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని తెలిపారు. వందరోజుల్లోపు తాము హామీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని.. కరెంటు బిల్లులు కొట్టొద్దన్న మాటలు మాట్లాడటం మానుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కు సూచన చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -