Monday, May 6, 2024
- Advertisement -

బాబు వస్తే సంక్షేమానికి బ్రేక్!

- Advertisement -

చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్నారు సీఎం జగన్. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని అక్కవరంలో మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన జగన్..చంద్రబాబు తీరును ఎండగట్టారు. ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైసీపీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

58 నెలల్లో 2లక్షల కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చాం. మీకు మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైన్యంలా నిలవండన్నారు. కురుక్షేత్రంలో మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించేందుకు సిద్ధమా? అని ప్రజలను అడిగారు జగన్.

చంద్రబాబుకు నన్ను తిట్టడం, తిట్టించడమే పనిగా మారిందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో అనేక మార్పులు తెచ్చాం. వాలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి సేవలు అందిస్తున్నారు అన్నారు. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు. రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా లబ్దిదారులకు అందించాం. మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు అండగా నిలవండన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా ఒక్క మంచి పని చంద్రబాబు చేయలేకపోయారన్నారు. జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -