Saturday, May 4, 2024
- Advertisement -

బకెట్‌తో గాజు గ్లాస్‌కు తల నొప్పి!

- Advertisement -

ఎన్నికల్లో ఇప్పటివరకు అధికార బీఆర్ఎస్‌కే షాక్‌ల మీద షాక్‌లు తగులుతు వస్తున్నాయి. ఎందుకంటే కారు గుర్తును పోలిన గుర్తుతో ఇప్పటివరకు బీఆర్ఎస్‌కు షాక్‌లు తగలగా తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న పవన్‌కు గట్టిదెబ్బ తగిలింది. తెలంగాణ జాతీయ జనసేన పార్టీ రూపంలో ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది.

జనసేన గుర్తు గాజు గ్లాసు కాగా తెలంగాణ జాతీయ జనసేన పార్టీ గుర్త బకెట్. ఈ రెండు పార్టీల గుర్తు ఒకే రకంగా ఉండటం చిక్కొచ్చి పడింది.రెండు పార్టీల పేర్లు ఒకేలా ఉండటం, రెండు పార్టీల గుర్తులూ ఇంచుమించు ఒకేలా ఉండటం జనసేన పార్టీకి సమస్యగా మారింది. అసలే తొలిసారి పోటీ చేస్తున్న పవన్ పార్టీ…గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం డిపాజిట్ దక్కకపోతే అది ఖచ్చితంగా ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపడం ఖాయం.

బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవ….న్ తెలంగాణలో మొత్తం 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక జనసేన గెలుస్తామని భావిస్తున్న స్థానాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి స్థానం ఒకటి. ఇదే స్థానం నుండి తెలంగాణ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి బరిలో ఉండటం జనసేనకు ఇబ్బందికరంగా మారింది. మరి ఈ గుర్తు గండాన్ని పవన్ ఎలా అధిగమిస్తారో వేచిచూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -